More in Telugu
  • Sign In
  • Create Account

  • My Account
  • Signed in as:

  • filler@godaddy.com


  • My Account
  • Sign out

  • Home
  • MY BLOG
  • EXAMS
  • MEDITATION/YOGA
  • More
    • Home
    • MY BLOG
    • EXAMS
    • MEDITATION/YOGA
More in Telugu

Signed in as:

filler@godaddy.com

  • Home
  • MY BLOG
  • EXAMS
  • MEDITATION/YOGA

Account


  • My Account
  • Sign out


  • Sign In
  • My Account

Capturing Life's Moments: A MORE IN TELUGU Photo Collection

My Blog

తరచుగా అడిగే ప్రశ్నలు

మీకు కలిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చట లేనిచో మమ్మలని సంప్రదించవచ్చు

వయస్సు పెరిగే కొద్ది శరీరంలో మార్పుల వలన, కుటుంబాన్ని పోషించుకోవడానికి పడే తపన, కష్టం వలన మనస్సు పదే పదే ఒత్తిడికి గురౌవుతూ ఉంటుంది.


అలాంటి మనస్సును ప్రశాంతంగా ఉంచుటకు మనం చేయవలసినదే ధ్యానం.


మనస్సు ప్రశాంతంగా ఉంటే సరియైన ఆలోచనలే కాదు శరీరంలో కలిగే మార్పులు (రోగ బాధ) నుండి కూడా బయట పడవచ్చును.


ధ్యానం వలన కలుగు ప్రయోజనం మీరు చేయు సాధన మీద అధారపడి ఉంటుంది. ఎందుకంటే మీ మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచగలరో అంత ప్రయోజనం కలుగుతుంది.


ధ్యానంలో మనస్సు ప్రధానం. సాధన మనస్సుపైనే కేంద్రీకృతం అవుతుంది. ఆలోచనలు, కోపావేశాలు, మనోభావాలు ఇలా అన్నీ మనసులోనే జరుగుతాయి.


అలాంటి మనస్సును ఒక క్రమపద్దతిలో ఉంచగలదు ఈ ధ్యానం. ప్రశాంతత, క్రమపద్దతి కలిగిన మనసు నిన్ను అన్ని విషయాలలోను విజయుడిని చేయగలదు


సాధారణంగా గమనిస్తే ఆత్మ, మనస్సు రెండూ ఒకేలా ఉంటాయి. ఎందుకంటే అవి శరీరంలోని అవయవాలు కాదు కాబట్టి గుర్తించడం కట్టం. 


నా వ్యక్తిగత పరిశీలన ద్వారా తెలిసింది ఎమిటంటే ఆత్మ, మనస్సు రెండూ ఒకదానికొకటి ముడిపడి కంటికి కనిపించని రెండు అదృష్ట శక్తులు. మన జీవితంలో వాటిని తెలుసుకోవడమే మొదటి అంశం.


రెండవ అంశం: ఎమిటంటే అందులో ప్రధానమైనది ఆత్మ (నేను). ఆత్మ అనునది ఉంటేనే మనస్సు ఉంటుంది. అంటే మనస్సు ఆత్మ ఆధారంగానే ఏర్పడుతుంది.  


ఇక మూడవ అంశం: ఆత్మ అనునది  నాశనం కాని ఒక మహా శక్తి. ఆ శక్తిని కప్పి ఉన్న మాయా పొర లాంటిదే మనస్సు.


చాలా మంది చెప్పే మాట భగవంతుడు అని అవునా!


కానీ నా ఆభిప్రాయం ప్రకారం నా జీవితానికి అన్నీ నా మనస్సే సూత్రదారి. నా జీవితంలో ఏర్పడే ప్రతి చర్యకు నా మనస్సు కారణం అవుతుంది. కాబట్టి నా జీవితంలో ఏర్పడే ప్రతి ద్వంద్వప్రవృత్తులకు కారణం నా మనస్సు మాత్రమే. అందుకే నేను నిరంతరం నా మనస్సునే పరివేక్షిస్తూ ఉంటాను. ఏ సంధర్భంలో నా మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది అని దాని వలన నా జీవితంలో ఏమి జరుగుతుంది అని ప్రతి సారి గమనిస్తూ ఉంటాను. అప్పుడే కదా తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. 


గమనించుకో మిత్రమా నీ మనస్సు ఏమి చేస్తుందో.


ధ్యానం చేయటం వలన నీలో రెండు రకాల ప్రయోజనాలు జరగవచ్చు.

మొదటిది: 

                      నీ మనస్సు కేంద్రీకృతం కాగలదు. కేంద్రీకృతం అయిన మనస్సు ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఇదే అతి పెద్ద అద్భతం.


రెండవది:

                     శరీరంలో చిన్న చిన్న ఆరోగ్యకరమైన సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో జరిగే అన్నియూ సజావుగా జరిగేలా చేస్తుంది.


Copyright © 2024 MORE IN TELUGU - All Rights Reserved.

MOREINTELUGU

  • MY BLOG
  • EXAMS
  • MEDITATION/YOGA